
‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తీసిన రెండవ చిత్రం ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత (ఖడ్గం ఫేమ్) ఇతర కీలక రోల్స్ చేశారు. ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ “మా అందాల సిరి” అనే మొదటి పాటని విడుదల చేశారు.
గోపీ సుందర్ తనదైన శైలిలో కంపోజ్ చేయగా శ్రీ కృష్ణ, రమ్య బెహరా గాత్రం పాటకి మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. వనమాలి రాసిన ఈ పాటలో అనుపమ పరమేశ్వరన్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ.
“టిల్లు స్క్వేర్” వంటి సినిమాల్లో తన అందాలతో ఆకట్టుకున్న అనుపమ ఈ సినిమాలో ఆఫ్ బీట్ చిత్రాల నటి తరహాలో కనిపిస్తోంది. ఇది పూర్తిగా అనుపమ స్టార్ డంపైనే ఆధారపడిన చిత్రం. మరి ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో అనుపమ హిట్ కొట్టగలదా అనేది చూడాలి. “టిల్లు స్క్వేర్”, “కార్తికేయ 2” చిత్రాల్లా ఈ సినిమా కూడా ఆడితే అనుపమ రేంజ్ పెరుగుతుంది.