
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన “ఆయ్” సినిమా హిట్టయింది. ఈ సినిమాకి అంజి.కే.మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ యువ దర్శకుడు మీడియాతో ముచ్చటించారు.
సినిమా చూశాక ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యారు?
ఎన్టీఆర్ గారు బావుంది, కామెడీని బాగా డీల్ చేశావు, క్లైమాక్స్ కూడా చాలా బాగా డీల్ చేశావు అని మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ గారి మాటలు మీరు వినే ఉంటారు. సెకండ్ సినిమా ఎప్పుడు తీస్తున్నావు, దాని కోసం వెయిట్ చేస్తున్నా అని అడిగారు. అన్ని పాత్రలు నిజంగా అనిపించాయి అని అన్నారు నాగ చైతన్య.
నార్నే నితిన్ తో సినిమా ఎలా అనుకున్నారు?
ముందు కథతో చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లాను. అనుకోకుండా నితిన్ గారిని కలవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన లేకపోతే అసలు సినిమానే లేదు. నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే కూడా దానికి కారణం ఆయనే. ఆయన్ని లైఫ్‌లో మర్చిపోలేను. ఆయన కథ వినే విధానం కూడా చాలా బాగుంటుంది. కసిరెడ్డి రాజ్ కుమార్ ని తీసుకోవాలని టీం అంతా అనుకున్నాం కానీ అంకిత్ నా ఛాయిస్.
కులం అనే టాపిక్ టచ్ చేశారు. ఇబ్బంది అవ్వలేదా..?
లేదు. సెన్సిటివ్ టాపిక్ అయినా కూడా కామెడీతో నడుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది అవ్వలేదు.
“ఆయ్” కన్నా ముందు ఇంకా ఏవైనా టైటిల్స్ అనుకున్నారా?
” రామాలయం వీధి కలిసేట్టు ” అనే టైటిల్ పెడదామనుకున్నాము. “ఆయ్” అనే టైటిల్ కూడా నేనే చెప్పాను. పెద్ద టైటిల్ బాగుండదని అల్లు అరవింద్ గారు “ఆయ్” టైటిల్ ఓకే చేశారు.
ఓటీటీలో డిలీట్ చేసిన సీన్స్ యాడ్ చేస్తారా?
లేదు. ఈ మధ్య ఏదో కొత్త రూల్ వచ్చింది అంట. సినిమా థియేటర్లో ఎంత రన్ టైం ఉంటే ఓటీటీలో కూడా అంతే ఉండాలి. కాబట్టి ఓటీటీలో అయితే యాడ్ చేయటం లేదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం వాసు గారు విడిగా రిలీజ్ చేద్దాం అన్నారు.