లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ కి అనీ మాస్టర్ మద్దతుగా నిలిచారు.
అనీ మాస్టర్ కూడా కొరియాగ్రాఫర్. చాలా సినిమాలకు ఆమె డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. ఆమె తాజాగా జానీ మాస్టర్ కి జాతీయ అవార్డు ఇవ్వకపోవడం గురించి తన బాధను వ్యక్తం చేసింది. జానీ మాస్టర్ కి ప్రకటించిన జాతీయ అవార్డుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసింది. మైనర్ గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదుచేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
కేసు విచారణ పూర్తి కాకుండా, కోర్టు ఏమి తీర్పు ఇవ్వకుండా, అతను దోషి అని నిరూపితం కాకుండానే ప్రభుత్వం ఇలా అవార్డు రద్దు చేయడం బాధగా అనిపించింది అని అని మాస్టర్ అంటున్నారు. జానీ మాస్టర్ తప్పు చేశారా లేదా అనేది తాను మాట్లాడడం లేదని కేవలం అవార్డు రద్దు చెయ్యడం కరెక్ట్ కాదని అంటోంది .
పోక్సో చట్టం కింద కేసు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కి బెయిల్ రద్దు అయింది. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు.