
ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే వంటి చిత్రాల్లో బాల నటుడి ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు.
ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ‘నిదురించు జహాపన’ అనే సినిమా రూపొందింది. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు.
“మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ కొత్త కాన్సెప్ట్ పరిచయం చేసింది. లవ్ స్టొరీలో ఒక కొత్త కోణం చూపిస్తున్నామని మేకర్స్ అంటున్నారు.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.