
అలియా భట్ కి ఇప్పుడు ఒక పెద్ద హీరోతో నటించాలన్న కోరిక లేదు. ఒక మలయాళం హీరోతో ఒక సినిమా చెయ్యాలని భావిస్తోంది. ఎందుకంటే అతని నటనకు ఆమె ఫిదా అయిపొయింది.
అతనెవరో కాదు… ఫహద్ ఫాజిల్. ఈ మలయాళం హీరో టాలెంట్ మన తెలుగు ప్రేక్షకులకే కాదు హోల్ ఇండియాకి తెలిసిపోయింది “పుష్ప”, “పుష్ప 2” సినిమాలతో. “గుండు పోలీసు” షెఖావత్ గా “పుష్ప”లో అదరగొట్టిన ఫహద్ ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడు.
మలయాళంలో హీరోగా నటిస్తాడు. అలాగే చిన్న పాత్రలు కూడా పోషిస్తాడు. తమిళంలో కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు కదా. తెలుగులో విలన్ గా మెప్పించాడు. ఇక ఇటీవల ఆయన మలయాళంలో చేసిన “ఆవేశం” సినిమా చూసి అలియా భట్ స్టన్ అయిపోయిందట. ఇంత వైవిధ్యమైన నటన ఎలా సాధ్యం అంటూ ఆమె ఆశ్చర్యపోతోంది. అందుకే ఆయనతో ఒక సినిమా చెయ్యాలని ఉంది అని చెప్తోంది.
అలియా భట్ ప్రస్తుతం భర్త రణబీర్ కపూర్ తో “లవ్ అండ్ వార్”లో నటిస్తోంది.