
అస్సాంలోని కామాఖ్య అమ్మవారి గుడికి ప్రతిరోజు వేలాది మంది వెళ్తుంటారు. దేశం నలుమూలాల నుంచి వెళ్లి అమ్మవారిని సందర్శించుకుంటారు భక్తులు. ఐతే ఇటీవల సినిమా హీరోయిన్ల తాకిడి ఆ గుడికి పెరిగింది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా ఆ గుడిలో పూజలు చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా అమ్మవారిని పూజించింది. ఆ ఫోటోలను షేర్ చేసింది.
ఆమె ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” అనే భారీ హిట్ అందుకొంది. 35 ఏళ్ల ఈ నటి తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్నారు.
ఇక తమన్నా, జ్యోతిక, సంయుక్త వంటి పలువురు హీరోయిన్లు ఇటీవల కామాఖ్యా దేవిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కూడా ఆ జాబితాలో చేరింది.