బిగ్ బాస్ తెలుగు సీజన్-8 రంజుగా సాగుతోంది. దీన్ని ఇష్టపడే జనాలు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్లు ప్రతి రోజూ ఫాలో అవుతున్నారు. అయితే ఓటీటీలో మాత్రం ఇది ఫెయిలైంది. ఇదిలా ఉండగా, ఈ సీజన్ లో ఎలిమినేషన్స్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు.
నిజానికి ఐదో వారం మిడ్-వీక్ లో నైనిక ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఆదిత్య ఓం హౌజ్ నుంచి బయటకెళ్లాడు. దీంతో హౌజ్ లో కాస్త స్టార్ ఎట్రాక్షన్ తగ్గిందనే చెప్పాలి.
ఈ సంగతి పక్కనపెడితే.. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినందుకుగాను ఆదిత్య ఓంకు దక్కిన రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హౌజ్ లో ఉండడానికి వారానికి 3 లక్షలు తీసుకున్నాడట ఆదిత్య ఓం. అంటే రోజుకు సుమారుగా 42 వేల రూపాయలన్నమాట.
అతడు హౌజ్ లో ఉన్న రోజులతో కౌంట్ చేస్తే, ఎలిమినేట్ అయ్యే టైమ్ కు అతడు 14 లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్టయింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా ఆకుల కంటే ఇది ఎక్కువ మొత్తం.
బిగ్ బాస్ హౌజ్ లో అందరికంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్న కంటెస్టెంట్ గా విష్ణుప్రియ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె అటుఇటుగా వారానికి 4 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. రెమ్యూనరేషన్ పరంగా ఆమె తర్వాత రెండో స్థానంలో నిలిచాడు ఆదిత్య ఓం.