‘దేవర’ సినిమాలో జాన్వి కపూర్ స్క్రీన్ టైమ్ పై చాలా విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో అలియాభట్ తో, దేవరతో జాన్వి పాత్రను పోల్చారు. కీలకమైన పాత్ర అయినప్పటికీ, పెద్దగా తెరపై కనిపించలేదంటూ ఆక్షేపించారు జనం.
ఇప్పుడు ‘దేవర’ సినిమాలో జాన్వి కపూర్ రన్ టైమ్ ఇంకాస్త పెరిగింది. ఈ సినిమా నుంచి కట్ చేసిన ‘దావుదీ’ సాంగ్ ను తాజాగా యాడ్ చేశారు. దీంతో సినిమా నిడివి మరింత పెరగడంతో పాటు జాన్వి కపూర్ స్క్రీన్ స్పేస్ కూడా పెరిగినట్టయింది.
“దేవర’ రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడీ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ను రప్పించేందుకు, సరైన టైమ్ చూసి దావూదీ సాంగ్ ను యాడ్ చేశారు.
ఆల్రెడీ ఈ పాట సోషల్ మీడియాలో పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. దీని పూర్తి వెర్షన్ చూడాలంటే, “దేవర” సినిమాను మరోసారి థియేటర్లలో చూడాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వి అందాల కోసం చాలామంది దేవరను మరోసారి చూసే అవకాశం ఉంది. ప్లాన్ అదుర్స్ కదా.