పెళ్లి తర్వాత తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సిద్దార్థ్-అదితిరావు. ఈసారి ఒకరికి సంబంధించి మరొకరు మరిన్ని వివరాలు బయటపెట్టారు. పెళ్లయి కొన్ని రోజులైనా గడవకముందే సిద్దార్థ్ లో తనకు నచ్చని అంశాలేంటో బయటపెట్టింది అదితిరావు.
మరీ ముఖ్యంగా ఉదయాన్నే సిద్ధూ నిద్రలేవడని, అది తనకు నచ్చదని అంటోంది. సూర్యోదయానికి ముందే లేస్తుందట అదితిరావు. తన భర్త కూడా అలానే లేవాలనేది ఆమె డిమాండ్. దీన్ని సిద్దార్థ్ ఒప్పుకోవడం లేదు. పొద్దున్నే నిద్రలేవడం తనకు నచ్చదని, అదితి మాత్రం తనను నిద్రలేపే వరకు ఊరుకోదని అన్నాడు. చిన్నపిల్లల దగ్గర్నుంచి చాక్లెట్ లాగేసుకున్నట్టు, తన దగ్గర్నుంచి నిద్రను లాగేసుకుందని సరదాగా కామెంట్ చేశాడు.
సిద్దార్థ్ తో కలిసి సూర్యోదయాలు ఆస్వాదించడం అదితికి ఇష్టమంట.
ఇక డిజైనర్ దుస్తుల కంటే, క్యాజువల్ దుస్తుల్లోనే సిద్దార్థ్ బాగుంటాడని చెబుతోంది. ఇక గొడవ జరిగితే ఎవరు ముందుగా సారీ చెబుతారనే అంశంపై స్పందిస్తూ.. తనే ముందుగా సారీ చెబుతానని తెలిపింది అదితి. త్వరలోనే ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లబోతోంది.