
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమాతో దర్శకుడిగా తనకు బాగా పేరు వచ్చింది అని అంటున్నారు చందూ మొండేటి. ఆయనతో ముచ్చట్లు…
‘తండేల్’ కథ ఎలా మొదలైంది?
పాక్ జైలు లో ఒక సెంట్రి అల్లు అర్జున్ అభిమాని. వాళ్ళు మన తెలుగు సినిమాలు గట్టిగా చూస్తారు. 22 మంది మత్య్సకారులు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పారు. అలా కథ గీతా ఆర్ట్స్ కి చేరుకొంది. దానికి కాల్పనికత జోడించి తీశాం. మన తెలుగు మత్య్సకారులు పాక్ జైల్లో మగ్గడం నిజం. వారి కోసం జరిగిన పోరాటం వాస్తవం. దానికి ఒక అందమైన ప్రేమకథ అల్లాం. అందుకే నిజమైన పేర్లు పెట్టలేదు. మొదట ఈ కథ విన్నప్పుడు పాక్ నేపథ్యంలో చేద్దామని అనుకున్నాను. కానీ ప్రేమకథలో ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. ఇద్దరు ప్రేమికులు ఒక విషయాన్ని కమ్యునికేట్ చేయాలంటే నెల రోజులు ఆగాలి. ఈ పాయింట్ నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అందుకే మెదట నుంచి ఈ సినిమా మేము ఎమోషనల్ లవ్ స్టొరీ అనే ప్రమోట్ చేశాం.
పాక్ ఎపిసోడ్స్ సెన్సార్ కి గురి అయ్యాయని విన్నాం?
అవును. జెండా చూపించడానికే ఒప్పుకోలేదు. డైలాగ్స్, మ్యుట్స్, విజువల్ కట్స్ చాలా వున్నాయి. ముఫ్ఫై శాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది.
సినిమా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అభినందించారా?
పలువురు దర్శకులు, హీరోలు కాల్ చేశారు. నాని, రామ్ కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ‘ఇది ఒక దర్శకుడి సినిమా’ అని రాఘవేంద్రరావు గారు చెప్పడం వెరీ మెమరబుల్.
తదుపరి చిత్రం?
“కార్తికేయ 3” చేస్తాను. దానికన్నా ముందు సూర్యగారితో ఒక సినిమా ఉండే అవకాశం ఉంది. చర్చలు అవుతున్నాయి.
చైతుతో తెనాలి రామకృష్ణుడు ఎనౌన్స్ చేశారు కదా?
చైతు “తండేల్”లో పెట్టిన ఎఫర్ట్, చేసిన నటన చూసిన వెంటనే తెనాలి రామకృష్ణుడు పాత్ర గురించి ఆలోచించాను. ఆ క్యారెక్టర్ లో కూడా ఆయన అద్భుతంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వగలరు. అలాంటి సినిమా ఆయన చేయాలని దర్శకుడిగా నా కోరిక. అది ఉంటుంది. కానీ దానికి టైం పడుతుంది.