![Pawan Kalyan](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/06/pawan-kalyan-janasenanew.jpg)
సాధారణంగా క్రికెట్ లో మాత్రమే స్ట్రయిక్ రేట్ అనే పదం వింటాం. కానీ ఏపీ రాజకీయాల్లో తొలిసారి ఈ పదం వినిపిస్తోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్. అవును.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాదించారు. అంటే పవన్ కల్యాణ్ స్ట్రయిట్ రేట్ వంద శాతం అన్నమాట.
అటు పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్ అదే జోరు చూపించారు. పార్టీ పెట్టిన పదేళ్లకు ఎమ్మెల్యేగా గెలిచిన పవన్, అదే ఊపులో భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించిన టాప్-5 ఎమ్మెల్యేల్లో పవన్ కల్యాణ్ కూడా ఒకరు.
ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకొని, 98 శాతం స్ట్రయిట్ రేట్ ఉండేలా అభ్యర్థుల్ని ఎంపిక చేశామని ఎన్నికలకు ముందే పవన్ ప్రకటించారు. ఆయన అంచనా నిజమైంది. స్ట్రయిట్ రేట్ ఏకంగా 100శాతం నమోదైంది.
2014 మార్చిలో పార్టీ పెట్టిన పవన్… 2024లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, తన పార్టీ నుంచి మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అందుకే ఆయన ఒకే ఒక్కడయ్యాడు. అటు టీడీపీ, ఇటు జనసేనకు ఒక్కడుగా మారాడు.