
విజయ్ దేవరకొండకి ఇటీవల హిట్స్ లేవు. రేస్ లో వెనుకబడ్డాడు. సరైన హిట్ పడితేనే అతనికి మళ్ళీ క్రేజ్ వస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కంటెంట్, మేకింగ్ రెండూ రిచ్ గా ఉండే సినిమాతో రావాలనేది అతని ప్రయత్నం.
ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక క్రైం డ్రామా (#VD12) చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ అనేక కారణాల వల్ల ఇంకా పూర్తి కాలేదు. ఐతే, ఈ సినిమా ఓటిటి హక్కులు ఆల్రెడీ అమ్ముడుపోయాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ తీసుకొంది.
తాజాగా ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తోంది నిర్మాణ సంస్థ. రెండు పార్టులలో రెండు వేరు వేరు కథలు ఉంటాయని చెప్పుకొచ్చాడు నిర్మాత నాగవంశీ. ఐతే మొదటి భాగం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
మార్చి 28న విడుదల చేస్తామని నిర్మాత ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు వేరే ఆలోచన ఉంది. సమ్మర్ తర్వాతే విడుదల అయ్యే అవకాశం ఉంది అనేది తాజా టాక్.