రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో బాగా పేరు వచ్చిన మూవీ ‘సత్యం సుందరం’. తెలుగులో అలాంటి సినిమా ఎవరు చేస్తే బాగుంటుంది? కాస్త ఆలోచిస్తే కొంతమంది హీరోల పేర్లు గుర్తుకురావొచ్చు కానీ విశ్వక్ సేన్ పేరు మాత్రం ఈ కేటగిరీలోకి రాదు.
విశ్వక్ చేసే సినిమాలు వేరు, బయట అతడి ఆటిట్యూడ్ వేరు. అలాంటి వ్యక్తి ఇలాంటి సాఫ్ట్ మూవీ చేస్తాడని ఎవ్వరూ అనుకోరు. కానీ తనకు అలాంటి సినిమాలే ఇష్టమంటున్నాడు విశ్వక్ సేన్. అంతేకాదు, ఆల్రెడీ దర్శకుడు ప్రేమ్ కుమార్ తో టచ్ లోకి వెళ్లానంటున్నాడు.
‘సత్యం సుందరం’ సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమా చేయాలని అనిపించిందట విశ్వక్ సేన్ కి. అందుకే వెంటనే ప్రేమ్ కుమార్ కు మెసేజ్ చేశాడు. మంచి కథ ఉంటే సినిమా చేద్దామని అడిగాడు. అట్నుంచి రిప్లయ్ కూడా వచ్చింది.
ఈ వాట్సాప్ ఛాటింగ్ మొత్తాన్ని బయటపెట్టాడు విశ్వక్ సేన్. తనకు ఇలాంటి సినిమాలు కూడా చేయాలని ఉంటుందని, కథలు రాసేవాళ్లు, దర్శకులు తనను కేవలం ఒకే కోణంలో చూడొద్దని కోరుతున్నాడు. అతడు నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.