ఉన్నట్టుండి సడెన్ గా కాశీలో ప్రత్యక్షమైంది శ్రీలీల. తల్లితో కలిసి స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు.. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంది. పుష్ప-2లో చేసిన సాంగ్ విడుదలకు సరిగ్గా 48 గంటల ముందు ఆమె ఇలా ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోవడం చాలామందికి నచ్చింది.
సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది శ్రీలీల. ‘గుంటూరు కారం’ ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్ కు పెద్ద దెబ్బ. దాంతో పాటు ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’, ‘ఆదికేశవ’ సినిమాలన్నీ ప్లాపులే.
ALSO READ: Sreeleela enjoys Benaras boat trip
ఈ ఏడాది ప్రారంభంలో ‘గుంటూరు కారం’ రాగా.. చివర్లో ‘పుష్ప-2’, ‘రాబిన్ హుడ్’ సినిమాలొస్తున్నాయి. నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ హిట్టయితే, ఈ ఏడాది ఆమె ఖాతాలో ఓ హిట్ పడుతుంది. లేదంటే అంతే సంగతులు.
కొత్త ఏడాదిలో ఆమె కెరీర్ పరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. బాలీవుడ్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తోంది. ఇవన్నీ వర్కవుట్ అవ్వాలంటే.. ‘పుష్ప-2’లో ఐటెంసాంగ్ హిట్టవ్వడంతో పాటు ‘రాబిన్ హుడ్’ సక్సెస్ అవ్వాలి. బహుశా, అందుకేనేమో ఈ ఆధ్యాత్మిక పర్యటనలు.