
విజయ్ దేవరకొండకి ఇటీవల హిట్స్ లేవు. నిజం చెప్పాలంటే అతని గత చిత్రం పాతిక కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేదు థియేటర్ నుంచి. మరి అంత ఘోరమైన ఫ్లాప్స్ ఉన్నా ఈ హీరోతో 100 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టి సినిమా తీస్తారా?
“మా సినిమాకి 130 కోట్లు ఖర్చు అయింది. కింగ్ డం విషయంలో మేం రాజీ పడలేదు. కథ, దర్శకుడి విజన్ ప్రకారం అంత బడ్జెట్ పెట్టాం,” అని నిర్మాత నాగ వంశీ తాజాగా మీడియా ఇంటర్వ్యూలలో తెలిపారు.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో “కింగ్ డం” రూపొందింది. ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏమి లేదు. కాకపోతే దర్శకుడికి మంచి పేరు ఉంది. “జెర్సీ” వంటి ఉత్తమ చిత్రం తీసిన దర్శకుడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథల సెలెక్షన్ మీద అందరికీ నమ్మకం పోయింది. కానీ ఆ దర్శకుడి టాక్ రికార్డ్ మీదే అందరి గురి.
దర్శకుడికి ఎంత మంచి పేరు ఉన్నా… విజయ్ దేవరకొండ ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. ఈ సినిమాతో లాభాలు రావాలంటే భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి.















