
పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ నేర్చుకుంది. రీసెంట్ గా వచ్చిన ‘8 వసంతాలు’ సినిమా కోసం ఆ హీరోయిన్ ఎంతో కష్టపడి కలరిపయట్టు (Kalaripayattu) అనే కేరళ సాంప్రదాయ యుద్ధ విద్యను నేర్చుకుంది.
ఇప్పుడు హీరోయిన్ వర్ష బొల్లమ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ, ఆ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కొన్ని పోర్షన్లలో యాక్షన్ లుక్ లో కనిపించనుంది వర్ష.
అందుకే ఈ పాత్ర కోసం ఆమె కష్టపడి కిక్ బాక్సింగ్ నేర్చుకున్నట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించాడు. త్వరలోనే ఆమె యాక్షన్ కట్ ను కూడా విడుదల చేయబోతున్నారు.
నిజానికి వర్ష బొల్లమకు యాక్షన్ కొత్త కాదు. ఇంతకుముందు సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో యాక్షన్ చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమ్ముడు కోసం మరోసారి యాక్షన్ లుక్ లోకి మారింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తనకు స్టార్ డమ్ తెచ్చిపెడుతుందని భావిస్తోంది వర్ష.