
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు తెల్లచీరలో కనిపించినప్పటికీ, వైట్ శారీకి బ్రాండ్ అంబాసిడర్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ శ్రీదేవినే.
ఇప్పుడీ కాస్ట్యూమ్ లోకి త్రిష మారింది. తెల్ల చీర కట్టుకొని, జుట్టు విరబూసుకొని ‘షుగర్ బేబీ’ అంటోంది. ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి షుగర్ బేబీ సాంగ్ రిలీజ్ చేశారు. రెహ్మాన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాటలో తెల్ల చీరలో శృంగారభరితంగా కనిపించింది త్రిష.
42 ఏళ్ల వయసులో కూడా ఆమె డాన్స్ చేస్తుంటే, చూడాలనిపించేలా ఉంది. తనకు వయసు పెరుగుతున్నా, సొగసు తరగలేదని ఈ సాంగ్ తో నిరూపించుకుంది త్రిష. పాట రెహ్మాన్ స్థాయికి తగ్గట్టు లేకపోయినా, త్రిష స్టెప్పులు పాటకు కొత్త కిక్కు తెచ్చిపెట్టాయి.
గ్యాంగ్ స్టర్ యాక్షన్ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కమల్ హాసన్, శింబు హీరోలుగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు.