
సంయుక్త కూడా గ్లామర్ బేబీగా మారుతోంది. ఇప్పటి వరకు ఆమెకి నటన విషయంలోనే పేరొంది. ఆమెకి గ్లామర్ తారగా గుర్తింపు లేదు. ఐతే, ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పుడు ఆమె గ్లామర్ డోస్ పెంచుతోంది.
ఇటీవలే ఈ భామ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ కి వెళ్లిన ప్రతి దక్షిణాది హీరోయిన్ తన స్టయిల్ ని మార్చేసుకుంటారు అనేది తెలిసిందే కదా. ఈ భామ కూడా అలాగే చేస్తోంది.
ప్రతివారం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ వాటిని షేర్ చేస్తోంది. ఒక్కో వారం డోస్ పెంచుతోంది.
“మహారాణి” అనే బాలీవుడ్ చిత్రంతో పాటు ప్రస్తుతం ఈ భామ పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది.”స్వయంభు” ఆమె చేస్తున్న పెద్ద చిత్రం. ఇక శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీలో కూడా సంయుక్త మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.