‘దేవర-1’ థియేటర్లలోకి వచ్చింది. కానీ వెంటనే ‘దేవర-2’ స్టార్ట్ చేయడం లేదు ఎన్టీఆర్. ముందుగా అతడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తాడు. ప్రస్తుతం ఆ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
మరోవైపు ఈ సినిమా మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తుందనే పుకారు నడుస్తోంది. తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చాడు నీల్. ఎన్టీఆర్ తో పీరియాడికల్ మూవీ చేస్తున్నానని, మైథలాజికల్ కాదని తెలిపాడు.
“ఎన్టీఆర్ తో మైథలాజికల్ సినిమా చేయడం లేదు. కెరీర్లో ఒక మైథలాజికల్ మూవీ చెయ్యాలనే ఐడియా ఉంది. కానీ ఈ మూవీ ఇప్పుడు తారక్ తో చెయ్యడం లేదు,” అని క్లారిటీ ఇచ్చాడు.
“అదొక పీరియాడిక్ మూవీ. నా మైండ్ లో ఓ మైథలాజికల్ కాన్సెప్ట్ ఉంది. గతంలో ఇదే విషయాన్ని చెప్పాను కూడా. కానీ తారక్ తో చేయబోయే సినిమాకు, నా మైండ్ లో ఉన్న మైథలాజికల్ కాన్సెప్ట్ కు సంబంధం లేదు.”
మరోవైపు ‘సలార్-2’పై కూడా స్పందించాడు ప్రశాంత్ నీల్. ‘సలార్-2’ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఎన్టీఆర్ సినిమా తర్వాత అది ఉంటుందని తెలిపాడు. తన కెరీర్ లోనే ది బెస్ట్ వర్క్ ‘సలార్-2’ అంటున్నాడు నీల్.