గాసిప్స్ అంటే హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటారు. తమ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందోనని కలవరపడతారు. వివాదాలు వస్తాయేమోనని భయపడతారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయోమే అని కంగారు పడుతుంటారు. కానీ తనకు అలాంటి టెన్షన్లు లేవంటోంది హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.
కెరీర్ ప్రారంభించిన ఇన్నేళ్లలో తనపై చాలా గాసిప్స్ వచ్చాయని, ప్రతి గాసిప్ ను తను ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. తనపై నెగెటివ్ రూమర్స్ ఎప్పుడూ రాలేదని, ప్రతి పుకారు పాజిటివ్ గానే ఉందని అంటోంది. ఈ సందర్భంగా ఓ ఉదాహరణ కూడా ఇచ్చింది.
మహేష్-రాజమౌళి సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు పుకారు వచ్చిందట. ఆ రూమర్ విన్నప్పుడు మనసులో ఎంతో సంబర పడ్డానని, ఆ పుకారు నిజం కావాలని దేవుడ్ని కోరుకున్నానని వెల్లడించింది.
వరుసగా బాలయ్య సినిమాల్లో ఆఫర్లు ఎందుకొస్తున్నాయంటే...
ఇక బాలకృష్ణతో వరుసగా సినిమాలు చేయడం, దానికి సంబంధించిన పుకార్లపై కూడా స్పందించింది. ‘డాకు మహారాజ్’ సినిమాలో తన ఎంపిక విషయంలో బాలయ్య ప్రమేయం లేదని, ఆ పాత్రను తను సూట్ అవుతానని భావించి దర్శకుడు బాబి సెలక్ట్ చేశాడని అంటోంది. ఇన్నేళ్ల తన కెరీర్ లో నెగెటివ్ పుకార్లు వినలేదంట ఈ బ్యూటీ.