“నీ సొంపులు చూపిస్తే బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు అని మా నిర్మాత నాతో చెప్పాడు. అసభ్యకరమైన భాష ఉపయోగించాడు,” అంటూ ఆదివారం పాయల్ రాజపుత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కలకలం రేపింది.
ఆమె కథానాయికగా “రక్షణ” అనే సినిమా తీసిన దర్శక, నిర్మాత ప్రాణదీప్ ఠాకుర్ గురించి ఆమె ఇలా ఆరోపణలు చేసింది. తీరా చూస్తే ఈ అమ్మడు చేసిన వీరంగం అంతా డబ్బుల కోసం అని తేలింది. ఈ సినిమా నాలుగేళ్ళ క్రితం మొదలైంది. అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. దాంతో ఆమె తనకు రావాల్సిన ఆరు లక్షల రూపాయలతో పాటు అదనంగా డబ్బు ఇస్తేనే ప్రమోషన్ కి వస్తాను అని గోల మొదలు పెట్టిందట.
నిర్మాత తనకు 6 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి మార్చిలోనే వచ్చిందని నిర్మాతల మండలి తాజాగా ప్రకటించింది. ఆ మొత్తం ఇప్పిస్తామని పాయల్ కి, ఆమె మేనేజర్ కి చెప్పినా వాళ్ళు సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేదు మండలి తెలిపింది.
సో, తన ఒంపుసొంపుల సంపదని చూపించమని ఒత్తిడి చేశారనే ఆమె ఆరోపణ, ఇతర కామెంట్స్ అన్నీ డబ్బులు రాబట్టుకోవడం కోసమే అని అర్థమవుతోంది.
ALSO READ: Producer’s Council condemns Payal Rajput’s statement
పైగా ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ లో తన సక్సెస్ ని నిర్మాత ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఆమె హిట్ చూసి చాలా కాలమే అవుతోంది. ఆమె ఇటీవల నటించిన “మంగళవారం” చిత్రానికి పేరు వచ్చిన మాట వాస్తవమే కానీ అది హిట్ మూవీ కాదు. మరి సక్సెస్ ఎక్కడ?