“దేవర” సినిమాకు సంబంధించి షార్క్ ఫైట్ ఎపిసోడ్ గురించి ఇదివరకే మాట్లాడాడు ఎన్టీఆర్. రోజంతా నీళ్లల్లో ఉంటూ శారీరకంగా చాలా కష్టపడ్డానని వెల్లడించాడు. అయితే మానసికంగా కష్టపడిన ఎపిసోడ్ ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు. అదే ఆయుధ పూజ సీన్.
“దేవర-1″లో ఆయుధ పూజ ఎపిసోడ్ ఉందంట. దాని కోసం రామోజీ ఫిలింసిటీలో సెట్ వేశారు. సినిమాకు కొబ్బరికాయ కొట్టి, మొదటి షెడ్యూల్ లో ఆయుధ పూజ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. కానీ ఆ రోజు అది సరిగ్గా రాలేదు.
అప్పట్నుంచి ఆ సీన్ మానసికంగా తనను ఇబ్బంది పెడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ సీన్ ఓకే అవ్వలేదని, అది అలా ఏడాదిన్నరగా సాగుతూ వచ్చిందని వెల్లడించాడు.
కొబ్బరికాయ కొట్టినప్పుడు మొదలుపెట్టిన ఆ ఎపిసోడ్ ను, గుమ్మడికాయ కొట్టినప్పుడు పూర్తిచేశామని.. అలా అది ఏడాదికి పైగా తన మైండ్ లో ఉండిపోయి, ఇబ్బంది పెట్టిందని వెల్లడించాడు ఎన్టీఆర్. 27న “దేవర” సినిమా థియేటర్లలోకి వస్తోంది.