
అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరోను చేసింది ‘పుష్ప-2’ సినిమా. ‘పుష్ప-1’ కూడా హిట్టయిప్పటికీ, ‘పుష్ప-2’ సృష్టించిన ప్రభంజనం నెక్ట్స్ లెవెల్. ఇండియాలోనే వసూళ్ల పరంగా ఇప్పుడు నంబర్ వన్ మూవీ ‘పుష్ప-2’. దక్షిణాది కంటే నార్త్ బెల్ట్ లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇది ఎలా సాధ్యమైంది.
దీనికి సరైన లాజిక్ అందించారు నాగార్జున.
వేవ్స్ సమ్మిట్ లో మాట్లాడిన నాగార్జున.. సౌత్ కంటే నార్త్ లో ‘పుష్ప-2’ సినిమా గట్టిగా ఆడిన విషయాన్ని అంగీకరించారు. ఆ సినిమా కథ, ప్రజెంటేషన్ ఉత్తరాది ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించిందని, సినిమా హిట్టవ్వడానికి అదే కారణమని అన్నారు. ‘పుష్ప-2’ టైపు నెరేషన్ ను బాలీవుడ్ చాన్నాళ్లుగా మిస్సయిందని, అందుకే ‘పుష్ప-2’కు నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని వెల్లడించారు.
ఇలాంటి నెరేషన్ సౌత్ సినిమాల్లో చాలా కామన్ గా కనిపిస్తుందన్నారు నాగార్జున. ‘పుష్ప-2’ సినిమా ఉత్తరాదిన ఆ రేంజ్ హిట్టవ్వడానికి కారణాన్ని ఇలా తనదైన శైలిలో చెప్పుకొచ్చారు నాగ్. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజం కూడా.