
తమిళ ఇండస్ట్రీలో కాలుమోపాలని చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది మృణాల్ ఠాకూర్. తెలుగులో ఇప్పటికే క్రేజ్ తెచ్చుకొంది. కానీ తమిళంలో మాత్రం అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతున్నాయి.
ఆ మధ్య ఆమె సూర్య సరసన నటించబోతుంది అని వార్తలు వచ్చాయి. ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమెకి ఆ అవకాశం రాలేదు. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. అంతకుముందు “కంగువ”లో కూడా ఆమె పేరుని పరిశీలించారు. కానీ చివరికి దిశా పటాని నటించింది.
మరి ఈ భామకి తమిళంలో ఛాన్స్ ఎప్పుడొస్తుందో మరి.
తెలుగులో ఈ భామ ‘సీతారామం’తో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించింది. ‘కల్కి’లో చిన్న పాత్రలో మెరిసింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’లో నటిస్తోంది.