సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, బ్రేకప్పులు చాలా సహజం. ఐతే హీరోయిన్లతో పోల్చితే హీరోలకే ఎక్కువ ప్రేమాయణాలు, అఫైర్లు ఉంటాయి. హీరోయిన్లు సహజంగా రెండు, మూడు డేటింగ్ అఫైర్లతో ముగింపు పలికి పెళ్లి చేసుకుంటారు. కానీ హీరోయిన్ శృతి హాసన్ మిగతా హీరోయిన్లతో పోల్చితే భిన్నం.
మరో బాయ్ఫ్రెండ్ కి ఆమె కటీఫ్ చెప్పినట్లు ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా డేటింగ్ చేసిన శంతను హజారికా హజారికాతో ఆమె బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థం అవుతోంది. ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో కొట్టారు. శంతను ఫోటోలను చాలా వరకు తన ఇన్ స్టాగ్రామ్ నుంచి శృతి తీసేసింది. దీన్ని బట్టి ఇద్దరూ చెరో దారి పట్టారు అని చెప్పొచ్చు.
ఆమె బయటి ప్రపంచానికి తెలిపిన డేటింగ్ లే అరడజను వరకు ఉన్నాయి.
ఆమె ఇప్పటివరకు డేటింగ్ చేసిన సెలెబ్రిటీలు వీళ్ళే…
సిద్ధార్థ్
ధనుష్
నాగ చైతన్య
సురేష్ రైనా (క్రికెటర్)
మైకేల్ కొర్సాలే
సిద్ధార్థ్ కన్నా ముందే ఆమె ఒక వ్యక్తితో డేటింగ్ చేసింది కానీ సిద్ధార్థ్ – శ్రుతి లవ్ అఫైర్ చాలా కాలం మీడియాలో నానింది. ఆ తర్వాత ఆమె ధనుష్ తో సన్నిహితంగా మెలిగినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇద్దరూ తమ డేటింగ్ గురించి బహిరంగంగా చెప్పుకోలేదు.
ఆ తర్వాత కొన్నాళ్ళూ నాగ చైతన్య, క్రికెటర్ సురేష్ రైనాతో మరికొన్నాళ్లూ ప్రేమబంధం నడిపింది. కానీ వీరి గురించి కూడా శృతి ఎక్కడా పబ్లిక్ గా మాట్లాడలేదు. ఆమె పబ్లిక్ గా కనిపించింది, సోషల్ మీడియాలతో ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకున్నది మైకేల్ కొర్సాలే అనే ఇటాలియన్ నటుడిని, శంతను అనే అతన్ని.
మైకేల్ తో మూడేళ్లు సహజీవనం చేసింది. తన బంధువులకు పరిచయం చేసింది. అతను తమిళనాడు పద్దతిలో పంచె కట్టి ఆమె తరపు బంధువుల శుభకార్యలకూ హాజరు అయ్యాడు. ఆ తర్వాత శంతనుతో నాలుగేళ్లు సహజీవనం చేసింది. కరోనా లాక్ డౌన్ టైంలో ఇద్దరు ఎన్నో వీడియోలు చేశారు. అతన్ని ఘాడంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు టాటా ఖతం బై… బై…
పెళ్ళి అంటే నచ్చదు
శృతి హాసన్ కి ఇప్పుడు 38 ఏళ్ళు. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. తన తండ్రి కమల్ హాసన్, తన తల్లి సారిక బంధం చూసి కాబోలు ఆమె పెళ్ళిపై వ్యతిరేక భావన తెచ్చుకొంది. నేను పెళ్లి చేసుకోను అని ఆమె ఇంతకుముందు ప్రకటించింది.