చాలామంది డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ గా మారింది. అవును.. మీనాక్షి చౌదరి డెంటిస్ట్, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత విధి ఆమెను గ్లామర్ ప్రపంచంలోకి లాక్కొచ్చింది.
డెంటిస్ట్ గా పనిచేస్తున్న టైమ్ లోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది మీనాక్షి. అందులో తన లుక్స్ తో చాలామందిని ఆకర్షించింది. అప్పుడే ఆమెకు తనపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో ముంబయిలో యాక్టింగ్ వర్క్ షాప్స్ లో జాయిన్ అయింది. అక్కడే సుశాంత్ తో పరిచయమైంది. ఆమె లుక్స్ నచ్చి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు సుశాంత్.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన మీనాక్షి.. ఆ సినిమా రిజల్ట్ తేడాకొట్టినా తను మాత్రం హిట్టయింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది. ఏకంగా మహేష్, కోలీవుడ్ స్టార్ విజయ్ లాంటి హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ లో పాతుకుపోతోంది.
డెంటిస్ట్ జాబ్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన మీనాక్షి.. ఇదంతా విధి విచిత్రం అంటోంది. ఇంతలా తన జీవితం మారిపోతుంది అని అనుకోలేదట. ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్నాయి – మట్కా, మెకానికి రాకీ.