కత్రినా కైఫ్ గర్భం దాల్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆమె లండన్ లోనే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కథనాలొచ్చాయి. కట్ చేస్తే, ఆమె ప్రెగ్నెంట్ కాదనే విషయం తెలిసింది.
భర్త విక్కీ కౌశల్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు లండన్ వెళ్లింది కత్రినా. భార్యాభర్తలిద్దరూ లండన్ వీధుల్లో షికార్లు కొడుతున్న స్టిల్స్ కొన్ని నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అందులో లాంగ్ కోట్ లో కాస్త పొట్టతో కనిపించింది కత్రిన. అంతే బాలీవుడ్ మీడియా కథలు అల్లేసింది.
లండన్ పర్యటన ముగించుకొని ముంబయి లో ల్యాండ్ అయిన ఈ పొడుగు కాళ్ల సుందరి, మీడియాను పలకరించింది. ఫొటోలకు పోజులిచ్చింది. ఆమెకు ఎలాంటి గర్భం లేదని మీడియాకు తెలిసొచ్చింది. అలా 2 వారాలుగా వచ్చిన కథనాలన్నీ పుకార్లుగా మిలిగిపోయాయి.
కత్రిన కైఫ్ కి ఇప్పుడు 40 ఏళ్ళు. 40లో కూడా ఇప్పుడు చాలామంది మహిళలు పిల్లలకు జన్మ ఇవ్వగలుగుతున్నారు. దీపిక 38వ ఏటా తల్లి కాబోతోంది. అలాగే కత్రిన గురించి ఇలా వార్తలు వచ్చాయి.