సాధారణంగా ఫ్లాప్ అయిన సినిమాలు వారం లేదా 2 వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తాయి. కానీ అటు ఇటు అనిపించుకున్న సినిమాలను కూడా వారాలకే థియేటర్లలోకి తీసుకురావడం ఇప్పుడు కొత్త ట్రెండ్. మొన్నటికిమొన్న కృష్ణమ్మ విషయంలో ఇలానే జరిగింది.ఆ సినిమాకి పేరు వచ్చింది. కానీ దాన్ని వెంటనే ఓటిటిలో విడుదల చేశారు.
ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిందని ప్రకటించుకున్నారు మేకర్స్. కానీ మూడు రోజులే కలెక్షన్లు కనిపించాయి. ఆ తర్వాత సినిమా పడకేసింది.
సో కట్ చేస్తే.. రిలీజైన 2 వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత నెల 31న థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 14న నెట్ ఫ్లిక్స్ తో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. కృష్ణ చైతన్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, కీలక పాత్రలో అంజలి కనిపించింది.