పెళ్లయిన తర్వాత గర్భం దాల్చడం కామన్. అలియాభట్, ఇలియానా లాంటి హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్స్ అయ్యారు. అది వేరే సంగతి. అయితే మూడో కేటగిరీ కూడా ఉంది. పెళ్లవ్వడమే ఆలస్యం ప్రెగ్మెంట్ అంటూ పుకార్లు ఎదుర్కొనే హీరోయిన్లు వీళ్లు. ఈ మూడో బ్యాచ్ లో ఉంది కత్రినాకైఫ్.
కత్రినా పెళ్లి చేసుకొని చాలా రోజులైంది. కానీ ఆమె ఇప్పటివరకు గర్భం దాల్చలేదు. అయితే మీడియా మాత్రం ఆమెకు ఇప్పటికే 3 సార్లు గర్భం వచ్చినట్టు ప్రకటించేసింది. తాజాగా మరోసారి కత్రినా ప్రెగ్నెంట్ అనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనికి ఓ కారణం కూడా ఉంది.
ప్రస్తుతం లండన్ లో ఉంది కత్రినా. అక్కడ ఆమె దిగిన ఫొటో ఒకటి వైరల్ అయింది. ఆ ఫొటోలో ఆమె నలుపు రంగు ఫుల్ కోట్ ధరించి ఉంది. అందులో ఆమె కాస్త పొట్టతో ఉన్నట్టు కనిపించింది. అంతే, ఆ వెంటనే ఆమె గర్భం దాల్చినట్టు పుకార్లు వచ్చేశాయి.
తనపై వచ్చిన పుకార్లను కత్రినా ఖండించింది. ముంబయిలో ఉన్న కత్రినా టీమ్ కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. లాంగ్ కోట్ వల్ల వచ్చిన చిక్కంతా ఇదంటూ ప్రకటించింది. కత్రినా హీరో విక్కీ కౌశల్ ని పెళ్లాడింది.