జాన్వీ కపూర్ కి ఎంతో క్రేజుంది. కానీ ఆ క్రేజ్ సోషల్ మీడియా వరకే పరిమితం. సాధారణ జనాల్లో ఆమెపై అంత ఆసక్తి లేదు అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాల్లో ఆమె పాపులారిటీ తక్కువే. దానికి కారణం… ఆమెకి ఇప్పటివరకు హిందీలో ఒక్క సాలిడ్ హిట్ పడలేదు.
తాజాగా మరో ఫ్లాప్ ఆమె ఖాతాలో చేరింది.
ఆమె హీరోయిన్ గా నటించిన “ఇలాజ్” సినిమా గత వీకెండ్ విడుదలైంది. మొదటి వీకెండ్ వసూళ్లు మరీ నాసిరకం. దేశం మొత్తం మీద ఈ సినిమా మొదటి మూడు రోజులకు ఐదున్నర (Rs 5.5 Cr) కోట్లు కలెక్ట్ చేసింది. ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అంటే ఈ సినిమా ఘోరంగా పరాజయం పాలు అయింది. నిర్మాతకు హీరోయిన్ కి పెట్టిన ఖర్చు కూడా రాలేదు అన్నమాట.
ఆమె హిందీలో ఇప్పటివరకు అరడజను చిత్రాల్లో నటిస్తే అందులో మూడు చిత్రాలు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల అయ్యాయి. ఆమె మొదటి చిత్రం “ధఢక్” మాత్రమే థియేటర్లలో ఆడింది. అంటే, ఆమెకి ఇప్పటివరకు బాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ లేదు.