ఇదో క్రేజీ రూమర్. ఆల్రెడీ అక్క జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు చెల్లెలు ఖుషీ కపూర్ కూడా టాలీవుడ్ పై కన్నేసిందంట. జాన్విలానే ఖుషి కూడా నందమూరి కాంపౌండ్ పైనే గురిపెట్టిందనేది తాజా సమాచారం.
బాలకృష్ణ తన నటవారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు మోక్షు. ఇందులో హీరోయిన్ గా ఖుషి కపూర్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. వినడానికి కాస్త క్రేజీగా ఉన్నప్పటికీ ఇదేమంత అసాధ్యం కాదు.
ఎందుకంటే, ఖుషీ కపూర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంది. ఓటీటీలో అడుగుపెడుతూనే, బాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది. కాబట్టి ఈమెను టాలీవుడ్ కు తీసుకురావడం పెద్ద సమస్య కాదు. పైగా అక్క కూడా ఇక్కడే ఉంది కాబట్టి, చెల్లెలకు పని ఈజీ అయిపోతుంది.
ఈ సందర్భంగా బోనీ కపూర్ గతంలో చేసిన కామెంట్స్ ను ఓసారి గుర్తుచేసుకుందాం. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడిన బోనీ కపూర్, తన చిన్నకూతురు ఖుషీకి కూడా సౌత్ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. చూస్తుంటే, పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి. జాన్వి-ఖుషి కలిసి టాలీవుడ్ ను ఏలేలా ఉన్నారు.