
ఒక్క సినిమాతో బాగా పాపులరైన హీరోయిన్… వైష్ణవి చైతన్య. “బేబీ” సినిమాతో భారీ హిట్ అందుకొంది. కుర్రకారులో క్రేజ్ తెచ్చుకొంది. పైగా పక్కా హైదరాబాదీ అమ్మాయి.
“బేబీ” సినిమా తర్వాత ఆమె వరుసపెట్టి సినిమాలు చేస్తుందనీ, ఆమె పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరుతుందనీ చాలామంది భావించారు. తెలుగు అమ్మాయి శ్రీలీలకి దక్కినట్టు ఆమెకి కూడా భారీ ఆఫర్లు వస్తాయి అని అనుకున్నారు. కానీ, ఆమె “బేబీ” తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే కనిపించింది. అది ఆడలేదు. మరో సినిమా “జాక్” (సిద్దూ జొన్నలగడ్డ హీరో) వచ్చేనెల విడుదల కానుంది.
ఇక రీసెంట్ గా “బేబీ” హీరో ఆనంద్ దేవరకొండతో కొత్తగా మరో సినిమా ఒప్పుకొంది. ఇంత తక్కువ అవకాశాలకు కారణమేంటి?
వైష్ణవి చైతన్య డేటింగ్ లో ఉందని, ఆ ప్రేమ వల్లే ఆమె కెరీర్ పై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని టాక్. ఈ పుకార్లలో నిజమెంతో?

విడుదలకు సిద్ధమైన “జాక్ కొంచెం క్రాక్” సినిమా ప్రమోషన్ లకు వైష్ణవి వచ్చినప్పుడు మీడియా ఈ ప్రశ్న వెయ్యొచ్చు. మరి ఆమె అప్పుడు ఇచ్చే సమాధానాన్ని బట్టి మనకు కొంచెం క్లారిటీ వస్తుంది.