తన రీఎంట్రీపై మరోసారి స్పందించింది ఇలియానా. ప్రస్తుతం పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమైన ఈ బ్యూటీ.. మళ్లీ సినిమాల్లో నటించే అంశంపై రియాక్ట్ అయింది. దేనికైనా టైమ్ రావాలని, రైట్ టైమ్ లో ఆటోమేటిగ్గా సినిమాల్లోకి వస్తానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తన టైమ్ అంతా తన కొడుక్కి కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. తన కొడుక్కి ఇది రైట్ టైమ్ అని, చిన్నారితో ఫుల్ టైమ్ ఉండాలని అంటోంది. వ్యక్తిగతంగా తనకు బీచ్ లంటే ఇష్టం కాబట్టి, ఏ దేశంలో ఉన్నప్పటికీ బీచ్ ను మాత్రం మిస్ అవ్వనని చెబుతోంది.
2023 మే నెలలో డోలన్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా. ఆగస్టు లో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచి కొడుకు ఆలనాపాలనతో బిజీగా ఉన్న గోవా బ్యూటీ, ఏకంగా భర్తతో కలిసి అమెరికాకు మకాం మార్చింది.
కెరీర్ కొనసాగించడం కంటే, లైఫ్ లో సెటిల్ అవ్వడానికే ఇలియానా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అయితే మంచి టైమ్ సెట్ అయినప్పుడు కచ్చితంగా సినిమాల్లోకి వస్తానంటంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ.’