ఆ చెట్టుకి, తెలుగు సినిమాకి ప్రత్యేక బంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నదీ తీర ప్రాంతంలోని ఆ చెట్టు ఎన్నో వందల చిత్రాల్లో కనిపించింది. ఆ చెట్టు కింద, ఆ చెట్టు పరిసరాల్లోని ప్రకృతి రామణీయతని ఎన్నో చిత్రాల్లో తెలుగు దర్శకులు బంధించారు.
140 ఏళ్ల నాటి ఆ చెట్టు ఇప్పుడు కుప్పకూలింది. ఇటీవల వరదలకు అది నేలకొరిగింది.
తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో నిద్ర గన్నేరుచెట్టు “సీతారామయ్యగారి మనవరాలు”, “దేవత”, “బొబ్బిలి రాజా”, “గోదావరి” వంటి అనేక చిత్రాల్లో కనిపించింది. వంశీ, కె విశ్వనాధ్, జంధ్యాల, రాఘవేంద్రరావు, దాసరి, వంటి దర్శకులు ఈ చెట్టు ప్రాంతంలో ఎన్నో కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు.
ఈ చెట్టు ఇక తెరపై కనిపించదు.