“వార్-2″లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు “దేవర” సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ, మరోవైపు “వార్-2” కోసం కాల్షీట్లు కేటాయించాడు తారక్. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తవ్వగా, కొత్త షెడ్యూల్ కోసం మరోసారి కాల్షీట్లు కేటాయించాడు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడట ఎన్టీఆర్. సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం స్పీడ్ బోట్ ఛేజింగ్ సీన్ తీశారట. 6 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో హృతిక్-ఎన్టీఆర్ పై ఈ స్పీడ్ బోట్ ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కించారు.
ఈ యాక్షన్ సీన్ ను డిజైన్ చేయడానికి యూనిట్ కు 3 నెలల టైమ్ పట్టిందంట. దక్షిణాఫ్రికా యాక్షన్ కొరియోగ్రాఫర్ ఫ్రెంజ్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తిచేశారు. ఇప్పటివరకు హాలీవుడ్ లో మాత్రమే కనిపించిన ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్ ను తొలిసారి ఇండియన్ స్క్రీన్స్ కు పరిచయం చేయబోతున్నారు.
చాలా రిస్క్ తో కూడిన ఈ సన్నివేశాల్ని, కట్టుదిట్టమైన భద్రత మధ్య తెరకెక్కించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ అనదగ్గ 11 మంది యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నారు. బోట్ ఛేజ్ సీన్ తో పాటు, సినిమాలో వచ్చే ఓ కత్తి యుద్ధం ఎపిసోడ్ కూడా హైలెట్ గా ఉంటుందట.