హీరోయిన్ల క్రష్ లిస్ట్ లో ప్రభాస్ పేరు కామన్ అయిపోయింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఏ హీరోయిన్ ను కదిపినా ప్రభాస్ అంటే ఇష్టం అంటున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ అంటే ఇలానే ఉంటుంది మరి. పైగా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోతోంది.
ఇప్పుడీ లిస్ట్ లోకి అనన్య నాగళ్ల కూడా చేరిపోయింది. ప్రభాస్ అంటే తనకు పిచ్చి అంటోంది అనన్య.
పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రభాస్ అంటే ఇష్టం ఇప్పటిది కాదంటోంది. చాలామంది బాహుబలి-1, బాహుబలి-2, కల్కి సినిమాలు చూసిన తర్వాత ప్రభాస్ పై ఇష్టం పెంచుకుంటున్నారని, కానీ తనకు ప్రభాస్ అంటే “వర్షం” సినిమా నుంచి క్రష్ అంటోంది.
ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందో రాదో తనకు తెలియదని, కనీసం అతడి సరసన ఓ చిన్న రోల్ వచ్చినా ఎగిరి గంతేస్తానని అంటోంది ఈ తెలుగు పిల్ల.