
మలయాళంలో ఫహద్ ఫాసిల్ పెద్ద హీరో. తెలుగులో కూడా ఇప్పటికే పాపులారిటీ పొందారు. “పుష్ప” సినిమాలో పోలీస్ అధికారి షెకావత్ గా అద్భుతమైన నటన చూపిన ఫహద్ ప్రేక్షకులలో క్రేజ్ ని సంపాదించాడు. ఇలాంటి పాపులర్ హీరో అప్పుడే రిటైర్ మెంట్ గురించి మాట్లాడుతున్నారు.
కెరీర్‌లో తాను అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఫహద్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.
స్పెయిన్‌లోని బార్సిలోనాలో రిటైర్ అయిపోయి నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాడు. బహుశా ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తానేమో అంటున్నాడు. తనకి డ్రైవింగ్ అంటే ఇస్తామంట. రిటైర్ అయ్యాక సరదాగా డ్రైవర్ గా పని చెయ్యాలని భావిస్తున్నాడు.
సెలబ్రిటీ జీవితానికి దూరంగా, సామాన్యుడిలా జీవించడమే తన అంతిమ కల అని ఫహద్ చెప్తున్నారు.















