
సుదీర్ఘ విరామం తర్వాత ‘విశ్వంభర’ మూవీ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సినిమాకు సంబంధించి లాస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నారు.
ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదొక ప్రత్యేక గీతం. దీని కోసం బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ను తీసుకొచ్చారు. నాగినిగా ఈమె చాలా పాపులర్. ఇప్పుడు చిరంజీవి సినిమాతో సౌత్ లో కూడా పాపులర్ అవ్వబోతోంది.
ప్రస్తుచం చిరు, మౌనీ రాయ్ కాంబోలో సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. గణేశ్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, భీమ్స్ ఈ పాటను స్వరపరిచాడు. నిజానికి ఈ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి. కానీ ప్రత్యేక గీతాన్ని భీమ్స్ కు అప్పగించారు.
మరోవైపు ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ జోరుగా సాగుతోంది. గ్రాఫిక్స్ పై దర్శకుడు వశిష్ఠ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తారు.















