
జాన్వీ కపూర్ తెలుగులోనూ, హిందీలోనూ పలు సినెమాలు చేస్తోంది. అవన్నీ ఇప్పుడు వరుసగా విడుదల డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. నిజానికి ఈ నెలలోనే ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం “పరమ్ సుందరి” విడుదల కావాలి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. వచ్చే నెల విడుదల అయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ లో మరో సినిమా రానుంది. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న “సన్నీ సంస్కారికీ తులసి కుమారి” (Sunny Sanskari Ki Tulsi Kumari) దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా నిర్మాణ సంస్థ డేట్ ని ప్రకటించింది.
డిసెంబర్ లో హోంబౌండ్ (Homebound)విడుదల కానుంది. ఇది ఇప్పటికే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఇక థియేటర్లలో డిసెంబర్ లో రానుంది.
ఆమె నటిస్తున్న బడా తెలుగు చిత్రం… పెద్ది. రామ్ చరణ్ ఆమె నటిస్తోన్న మొదటి మూవీ. షూటింగ్ జరుగుతోంది. మార్చి 27, 2026న విడుదల కానుంది “పెద్ది.” సో, మొత్తంగా ఈ భామ నుంచి వరుసగా నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.















