
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా గురించి చాలా చర్చ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. జూన్ లో ప్రకటన అన్నారు, ఆ తర్వాత జులైలో ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ జరుపుకుంటుందంట.
వెంకటేష్ త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి షూటింగ్ లో పాల్గొంటారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తోన్న మూవీలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ షూటింగ్ పూర్తి చేశాకే త్రివిక్రమ్ సినిమా మొదలుపెడుతాడట.
అందుకే, ఈ సినిమా ప్రకటన ఆలస్యం అవుతోంది. సినిమా షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయినా వేగంగా పూర్తి చేసి కుదిరితే వచ్చే వేసవి లేదా లేట్ సమ్మర్ లో విడుదల చెయ్యాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.
ఈ సినిమాకి “వెంకటరమణ”, “ఆనంద్ రావు” అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్.















