
ఈ కన్నడ సూపర్ స్టార్ కు ఎలాంటి భేషజాలు ఉండవనే విషయం తెలిసిందే. అంత సీనియర్ అయినప్పటికీ ఏమాత్రం ఇగో చూపించరు. తాజాగా జరిగిన ఓ ఘటన, ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. శ్రీలీలతో శివరాజ్ కుమార్ డాన్స్ చేసిన సందర్భం ఇది.
‘జూనియర్’ సినిమా ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు శివరాజ్ కుమార్. సినిమాలో సూపర్ హిట్ సాంగ్ కు స్టేజ్ పై హీరో కిరిటీ, హీరోయిన్ శ్రీలీల డాన్స్ చేయాలి. వాళ్లిద్దరూ బాగా ప్రాక్టీస్ చేసిన మూమెంట్ కూడా అది.
వీళ్లు శివరాజ్ కుమార్ ను డాన్స్ కోసం పిలిచారు. ఏమాత్రం మొహమాటపడకుండా శివన్న స్టేజ్ పైకి వెళ్లారు. శ్రీలీల, కిరిటీతో కలిసి వైరల్ స్టెప్ కు డాన్స్ చేశారు. ఈ వయసులో కూడా శివన్న గ్రేస్ చూసి ఆడిటోరియం మార్మోగిపోయింది.
వచ్చే శుక్రవారం ‘జూనియర్’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో గాలి జనార్థనరెడ్డి కొడుకు కిరీటి రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుబోతున్నాడు.















