
ప్రస్తుతం టాలీవుడ్ లో పాత హీరోయిన్ల రీఎంట్రీ సీజన్ నడుస్తోంది. రీసెంట్ గా లయ రీఎంట్రీ ఇచ్చింది. కీర్తి చావ్లా, అనిత, భూమిక లాంటి ఒకప్పటి హీరోయిన్లంతా తెలుగుతెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ జాబితాలో చేరడానికి శిల్పా షెట్టి కూడా తహతహలాడుతోంది.
ఆల్రెడీ కన్నడనాట రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆమె నటించిన ఓ సినిమా సౌత్ అంతటా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన శిల్పా షెట్టి, మంచి ఛాన్స్ దొరికితే తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అని ప్రకటించింది.
అయితే తన రీఎంట్రీకి కొన్ని కండిషన్స్ చెప్పుకొచ్చింది. తనకు మాస్ హీరోయిన్ ఇమేజ్ ఉండేదని, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి మాస్ పాత్రలైతే చేస్తానని అంటోంది.
తెలుగులో హీరోయిన్లకే సరైన రోల్స్ దొరకవు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన హీరోయిన్లకు ఎక్కడ్నుంచి పాత్రలు పుట్టుకొస్తాయి. ఇలాంటి కండిషన్స్ పెడుతూ కూర్చుంటే, టాలీవుడ్ ను శిల్పాషెట్టి మరిచిపోవచ్చు. అలా కాకుండా, మంచి బ్యానర్, హీరో, దర్శకుడు లాంటి ఎలిమెంట్స్ చూసుకుంటే, మరోసారి పాన్ ఇండియా లెవెల్లో వెలిగిపోవచ్చు. ఈ విషయం ఆమెకు ఎవరైనా చెబితే బాగుణ్ను.















