
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ బజ్ ను మరింత ముందుుక తీసుకెళ్లేందుకు భారీగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతుందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక అతిథిగా వస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఏఎం రత్నం తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతుందని స్పష్టం చేశారు.
వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 2 వేదికలు అనుకున్నారు. వర్షాలు కురవకపోతే తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. ఒకవేల వర్షాలు కురుస్తుంటే, విజయవాడలోనే ఇండోర్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారు.
లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, అతడి అభిమానులు ‘హరిహర వీరమల్లు’ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి నాలుగేళ్లు టైమ్ తీసుకున్నారు పవన్ కల్యాణ్.















