
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది హీరోయిన్ సమంత. తనకు ఫోన్ అడిక్షన్ ఉండేదని, సెల్ ఫోన్ కు బాగా బానిసయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. అతి కష్టమ్మీద ఆ అలవాటు నుంచి బయటపడినట్టు వెల్లడించింది.
మొబైల్ అలవాటు నుంచి బయటపడేందుకు తను డిజిటల్ డిటాక్స్ ను కఠినంగా ఫాలో అయ్యానని వెల్లడించింది సమంత. ఫోన్, సోషల్ మీడియాతో టచ్ లేకుండా 3 రోజుల పాటు ఉన్నానని, అలా చేసిన తర్వాత తను చాలా మారానని చెబుతోంది సమంత.
ఫోన్ లేదా సోషల్ మీడియాను పరిమితంగా వాడాలని, ఇంకా చెప్పాలంటే అవసరం మేరకు మాత్రమే వాడాలని సూచిస్తోంది సమంత. అవసరం ఉన్నా లేకపోయినా చేతిలో ఫోన్ పెట్టుకోవడం అనే అలవాటును మానుకోవాలని చెబుతోంది.
తను చెప్పినట్టు చేస్తే మంచి ఫలితాలొస్తాయని చెబుతోంది శామ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ చేస్తోంది.