
హీరోయిన్ శృతిహాసన్, సోషల్ మీడియాకు శెలవు పెట్టింది. కొన్నాళ్ల పాటు తను సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తానని ఆమె ప్రకటించింది. దీన్నే టెక్నికల్ గా డిజిటల్ డిటాక్స్ అని అంటారు.
మొన్ననే శృతిహాసన్ తన ఎకౌంట్ ను కోల్పోయింది. కొంతమంది హాకర్లు, ఆమె సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారు. క్రిప్టో కరెన్సీకి చెందిన యాడ్స్ పెట్టుకున్నారు. అతి కష్టమ్మీద తన ఎకౌంట్ ను తిరిగి దక్కించుకుంది శృతిహాసన్.
అలా ఎకౌంట్ ను తిరిగి పొందిన కొన్ని రోజులకే ఆమె డిజిటల్ డిటాక్స్ ను ప్రకటించడం విశేషం. శృతిహాసన్ ఇంత సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
మరికొంతమంది మాత్రం ఆమె ‘కూలి’ సినిమా ప్రచారం కోసం ఫ్రెష్ గా జనం ముందుకొచ్చేందుకు ఇలా సోషల్ మీడియాకు గ్యాప్ ఇచ్చినట్టు చెబుతున్నారు. నిత్యం ఇనస్టాగ్రామ్ లో ఏదో ఒక పోస్టు పెట్టే శృతిహాసన్, సోషల్ మీడియాకు ఎన్ని రోజులు దూరంగా ఉండగలదో చూద్దాం.