
అంచనాలతో వచ్చిన ‘తమ్ముడు’ ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ అని తేలిపోయింది.
నిజంగా ‘తమ్ముడు’ సినిమా హిట్టయినట్టయితే నితిన్ కొంచెం ఊపిరి పీల్చుకునేవాడు. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. నితిన్ కి ఇది వరుసగా నాలుగో ఫ్లాప్. పాపం నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్న ప్రతి దర్శకుడూ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళని నమ్మి సినిమాలు చేస్తే ఏదేదో తీసేస్తున్నారు.
నితిన్ మళ్ళీ…. “ఇష్క్” రిలీజ్ కు ముందు బాగా ఆలోచించి సినిమాలు చెయ్యాలి. ఆ సినిమాతో పాటు ‘గుండె జారి గల్లంతయిందే’ నితిన్ కెరీర్ కి బూస్టప్ ఇచ్చాయి. అలా వరుసగా రెండు మంచి హిట్స్ పడేలా సినిమాలు చెయ్యాలి నితిన్. లేదంటే ఇప్పటికే భారీ మార్కెట్ తగ్గిపోయింది. అది మరింత పడిపోతుంది.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు కాకుండా కథాబలం, నేరేషన్ లో దమ్మున్న సినిమాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి.