
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు తీసుకొస్తున్నాడు. ‘కిల్లర్’ టైటిల్ తో కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేసిన ఈ నటుడు, ప్రస్తుతం ఆ సినిమాకు కాస్టింగ్, టెక్నీషియన్స్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు.
ఇందులో భాగంగా తన సినిమాకు ఏఆర్ రెహ్మాన్ కు సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఎస్ జే సూర్యకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆ విషయం టాలీవుడ్ జనాలకు తెలియకపోవచ్చు కానీ, కోలీవుడ్ ఆడియన్స్ కు తెలుసు. సో.. వీళ్లిద్దరి కాంబోలో మంచి సాంగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే సూర్య ఆలోచన మరోలా ఉంది. పాటల కోసం రెహ్మాన్ ను తీసుకోలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ‘కిల్లర్’ మూవీకి సరికొత్త సౌండింగ్ కావాలి, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి. ఇంకా చెప్పాలంటే సంగీతంతో ప్రయోగం చేయాలి. అందుకే రెహ్మాన్ ను ఎంచుకున్నాడు.
స్వీయ దర్శకత్వంలో ఎస్ జే సూర్య హీరోగా ఈ సినిమా రాబోతోంది. గోకులం మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు ఎస్ జే సూర్య. ఈ ప్రాజెక్టు కోసం అతడు తన యాక్టింగ్ కు కెరీర్ కు చిన్న గ్యాప్ ఇచ్చాడు.