
కొన్ని రోజులుగా ‘విశ్వంభర’ సినిమాపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని, వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉందంటూ కథనాలు వస్తున్నాయి.
తాజాగా వీటిపై దర్శకుడు వశిష్ఠ స్పందించాడు. సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఇంకాస్త టైమ్ పడుతుందని మాత్రం చెప్పేశాడు. గ్రాఫిక్స్ వల్లనే సినిమా లేట్ అవుతుందని వెల్లడించాడు.
“విశ్వంభర సినిమాలో 4676 గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాయి. ఆ పనులు ఓ కొలిక్కి రావడానికి టైమ్ పడుతుంది. ప్రతి ఫ్రేమ్ ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కాబట్టి టైమ్ పడుతుంది.”
ఇలా ‘విశ్వంభర’ విడుదల లేట్ అవుతుందని చెప్పేశాడు వశిష్ఠ. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. అది ఐటెంసాంగ్. ఈ సాంగ్ షూట్ తో పాటు, గ్రాఫిక్స్ కొలిక్కి వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటున్నాడు వశిష్ఠ.