
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి పోషించిన పాత్రని చూసి షాక్ అయ్యానని తెలిపింది. ఆ నటికి ఫోన్ చేసి అలాంటి రోల్స్ ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగితే “ఆంటీ” పాత్రలు చెయ్యడం కన్నా ఇవి బెటర్ అని చాలా గర్వంగా మాట్లాడింది అని సిమ్రాన్ చెప్పింది.
సిమ్రాన్ పోషిస్తున్న ఆంటీ పాత్రల గురించి సదరు నటి సెటైర్ వేసింది. దాంతో, నువ్వు చేస్తున్న “డబ్బా రోల్స్” కన్నా “ఆంటీ రోల్స్” బెటర్ అని సిమ్రాన్ సమాధానం ఇచ్చిందట. ఇదంతా సిమ్రాన్ పబ్లిక్ గా చెప్పింది.
తాజాగా సిమ్రాన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. తన ఒకప్పటి కొలీగ్ ఇప్పుడు క్షమాపణ చెప్పింది అని సిమ్రాన్ తెలిపింది. అంటే ఆ “డబ్బా తార” సిమ్రాన్ కి క్షమాపణ చెప్పింది అన్నమాట.
జ్యోతిక “డబ్బా కార్టెల్” అనే వెబ్ సిరీస్ లో నటించింది. దాంతో సిమ్రాన్ మాట్లాడిన ఆ “డబ్బా తార” జ్యోతికనే అని సోషల్ మీడియా తీర్మానించింది. కానీ, సిమ్రాన్ ఇప్పటికీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు.