
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో… కుదిరితే రామ్ చరణ్ తో, కుదరకపోతే వెంకటేశ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం ఉంది.
దీంతో చరణ్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఎందుకంటే, ‘పెద్ది’ తర్వాత చరణ్ చేయాల్సిన సినిమా సుకుమార్ ది. ‘పుష్ప-2’కు మించిన రేంజ్ లో ఆ సినిమా ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఇప్పట్నుంచే కలలు కంటున్నారు.ఇలాంటి టైమ్ లో సడెన్ గా సీన్ లోకి త్రివిక్రమ్ రావడంతో చాలామంది అయోమయానికి గురయ్యారు. అయితే ఇకపై అలాంటి డౌట్స్ అక్కర్లేదు. స్వయంగా సుకుమార్ ఈ అంశంపై స్పందించాడు.
తన నెక్ట్స్ సినిమా, చరణ్ నెక్ట్స్ సినిమా ఒకటేనని ప్రకటించాడు సుకుమార్.
ప్రస్తుతం చరణ్ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నామని, బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే తన సినిమానే ఉంటుందని సుక్కూ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ‘రంగస్థలం’ వచ్చింది. తాజాగా సుకుమార్ తన సొంత ఊరు వెళ్ళాడు. అక్కడ ఈ విషయం చెప్పాడు.